మిత్రలాభం

మిత్రలాభం - 7 వ  రోజు
Hindu Dharma Chakram
‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో 🐕 స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని 🐈 ఆదరించి ముసలి గద్ద 🦅 ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక 🦌 ‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.🐦

గుడ్డిగద్ద కథ 🦅

వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు 🌳 ఉండేది. దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద🦅 ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి. జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు. నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద 🦅 కాపలా కాసేది.
ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి🐈  ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను 👅  పెదాలకు  రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది. మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి 🐈 తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. 🐈 ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద.🦅  తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.🐈
‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. 🐈 ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని ’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద.🦅  నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.🐈 ‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వెళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.‘🐈                    ‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.🦅  ‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.🦅 ‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి. 🐈 తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. 🦅 ‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.
చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.🐈 ‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.‘🐈  ‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.  ‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట ’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద.🦅  ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది.
పిల్లిని🐈  ఇలా ఓదార్చింది. .....  ఎలా ? ఇంకా ఉంది గా రేపటి భాగంలో చెప్పుకుందాం.

Comments

Popular posts from this blog

కర్మ ఫలం

రావణుడు అంత గొప్ప సోదరుడా?

నీటి కుంటల నిర్మాణం